|
మధ్యాహ్న బోజన పధకము పై అవగాహన
క్రమసంఖ్య | రోజు | మేను వివరాలు |
1 | సోమవారం | అన్నము మరియు పప్పు సంబారు |
2 | మంగళవారము | అన్నము మరియు కూరగాయలతో కూడిన కూర మఱియు కోడిగుడ్డు |
3 | బుధవారము | అన్నము మరియు పప్పు ఆకుకూరలతో కూడిన కూర |
4 | గురువారము | అన్నము మరియు సంబారు |
5 | శుక్రవారము | అన్నము మరియు కూరగాయలతో కూడిన కూర మఱియు కోడిగుడ్డు |
6 | శనివారము | అన్నము మరియు పప్పు ఆకుకూరలతో కూడిన కూర |
Note:ప్రతి వారములో మంగళవారము మరియు శుక్రవారము తప్పని సరిగా కోడి గుడ్డు పెట్టవలెను |
ప్రతి రోజు ప్రతి విద్యార్థికి పెట్టవలసిన ఆహార పరిమాణము, కేలరీలు, మరియు కుక్కింగ్ కాస్టు వివరాలు
వివరాలు |
ప్రాధమిక |
ప్రాధమికోన్నత |
ఉన్నత |
ప్రాధమిక |
ప్రాధమికోన్నత |
ఉన్నత |
బియ్యం |
100 గ్రా |
20 గ్రా |
150 గ్రా |
310 కేలరీలు |
510 కేలరీలు |
510 కేలరీలు |
పప్పు |
20 గ్రా |
30 గ్రా |
30 గ్రా |
60 కేలరీలు |
100 కేలరీలు |
100 కేలరీలు |
కూరగాయలు మరయు ఆకు కూరలు |
50 గ్రా |
75 గ్రా |
75 గ్రా |
25 కేలరీలు |
30 కేలరీలు |
30 కేలరీలు |
నూనె |
5 గ్రా |
75 గ్రా |
7.5 గ్రా |
25 కేలరీలు |
30 కేలరీలు |
30 కేలరీలు |
కుకింగ్ కాస్ట్ ప్రతి విద్యార్థికి |
3.84 రూ |
4.40 రూ |
4.40 రూ |
--------- |
--------- |
--------- |
ఉదా: ఒక ప్రాధమిక పాటశాలలో 100 మంది విద్యార్థులు మధ్యాహ్న బోజనమును తీసుకొను సందర్భములో ఆహారపదార్థాల పరిమాణము క్రింది విధముగా వుండవలెను
|
బియ్యం=100X100 grams = 10kgs, కూరగాయలు = 100x50 Grams = 5Kgs |
పప్పు=100X120 grams = 20kgs , నూనె = 100x50 Grams = 5Kgs |
- ప్రతిరోజు విద్యార్థులు తప్పని సరిగా బోజనము తినే ముందు మరియు తినిన తరువాత చేతులను శుబ్రముగా కడుగావలెను.
- వంటలో తప్పని సరిగా అయోడిన్ ఉప్పు మాత్రమే ఉపయోగించవలెను.
- పాటశాల ఆవరణలో మాత్రమే మధ్యాహ్న భోజనము వండవలెను. ఇమ్ప్లిమెంటింగ్ ఎజేన్సి ఇంటి వద్ద గాని, ప్రధానోపాధ్యాయుని ఇంటి వద్దగానీ నిర్వహించరాదు.
- పాటశాలకు వచ్చిన బియ్యంను కూడా పాటసాలలోనే బద్రపరచవలెను.ఇమ్ప్లిమెంటింగ్ ఎజేన్చి ఇంటి వద్ద గాని, ప్రధానోపాధ్యాయుని ఇంటి వద్దగానీ భద్రపరచరాదు.
- డీలర్ నుండి పాటశాలకు బియ్యం తెచేముందు తప్పని సరిగా బియ్యం నాణ్యతను మరియు తూకమును సరిచుచు కొనిన తరువాత మాత్రమే బియ్యం తీసుకొనవలెను.
- వంట వండటం మొదలు పెట్టిన తరువాత నుది విద్యార్థులు తినే వరకు వంట పాత్రలపై తప్పనిసరిగా మూతలు వుండేలా ఇమ్ప్లిమెంటింగ్ ఏజెన్సి వారు మరియు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించవలెను
- ప్రతి పాటశాలలో బియ్యం,కుకింగ్ కాస్టు సంబంధిచిన లెక్కలను తప్పనిసరిగా రికార్డు చేయవలెను.నిల్వ వున్నా స్టాకు వివరాలను మరియు రికార్డులను అదికారులు తనికీకి వచ్చినపుడు చూపించాలి.
- ప్రతి పాటశాలలో తప్పని సరిగా రోజువారి విద్యార్థులకు వడ్డించు మెను మరియు మధ్యాహ్న బోజన పధకము యొక్క 'లోగో' (ప్రతిమ) ను గోడ పై చిత్రీకరించాలి.
- కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్యాలచే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ బడుచున్నది. కావున, పై పధకము నిర్వహణలో ఎటువంటి సమస్యలు ఏర్పడినా, వెంటనే సంబంధిత మండల విద్యాశాఖ అధికారికి గాని, ఉప విద్యాశాఖ అధిఖారికి గాని తెలియ జేయవలెను. లేనిచో సంబంధిత వ్యక్తుల పై తగిన చర్యలు తీసుకోబడును.
|
|
|