AP Teachers Transfers 2022 Imp General Instructions

AP Teachers Transfers 2022 Certain Instructions to Apply Online

AP Teachers Transfers 2022 has started as per the schedule and instructions given in GO.187 Dt:10/12/2022 .Teachers who are applying for transfers following information may helpful. Teachers are advised to take a look at the following information while applying for AP Teachers transfers online. The information given below is in Telugu as stated in GO.187.

General Instructions on AP Teachers Transfers 2022 in Telugu
General Instructions on AP Teachers Transfers 2022 in Telugu

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి సూచనలు

  • ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా (17-12-2022తేదిలోగా..) https://teacherinfo.apcfss.in/  వెబ్సైట్ నందు సమర్పించాల్సి ఉంటుంది.
  •  క్రింద తెలిపిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
  • రీ అప్పోర్షన్మెంట్ 2022 ప్రక్రియలో ( GO 117 & GO 128 ననుసరించి) సర్ప్లస్ గా గుర్తించబడిన ఉపాధ్యాయులు
  • 5 విద్యా సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు [02-11-2017 తేదికి ముందు పాఠశాలలో చేరినవారు(కేడర్ తో సంబంధం లేకుండా)]  & 8 విద్యా సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు[ 02-11-2014 తేదికి ముందు పాఠశాలలో చేరినవారు(కేడర్ తో సంబంధం లేకుండా) ]
  • గమనిక: 31-08-2024లోపు(2 సంవత్సరాలలోపు) పదవీవిరమణ పొందే ఉపాధ్యాయులకు మినహాయింపు.
  • 31-08-2022 వతేదీ నాటికి 50 సంవత్సరాలు లోపు వయసు గల బాలికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయులు  తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.
  • Against పోస్టులో పని చేస్తున్న లాంగ్వేజ్ పండిట్లు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.
  • 14.10.2021 వ తేదీ నాడు కమిషనర్ గారి చే జారీ చేయబడిన మార్గదర్శకాలను అనుసరించి పదోన్నతి పొందిన ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవలెను.

Subject Conversion Teachers need to Apply Transfers

  • స్కూల్ అసిస్టెంట్ గణితం మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులకు తమ విల్లింగ్ ప్రకారం కన్వర్షన్ అయిన టీచర్స్ తప్పనిసరిగా కన్వర్ట్ అయిన సబ్జెక్టు నందు ఉపాధ్యాయ బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. బదిలీ దరఖాస్తులో కన్వర్ట్ అయిన సబ్జెక్టు కు మార్చుకోవడానికి అవకాశం కల్పించబడింది.
  • జూనియర్ మోస్ట్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ 22 మందిని గణితం సబ్జెక్టుకు కన్వర్ట్ చేయడం జరిగింది మీరు కూడా తప్పనిసరిగా మాథ్స్ సబ్జెక్టు నందు బదిలీ దరఖాస్తు గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది.

పునర్విభజనపై(Reapportionment) బదిలీ చేయబడిన ఉపాధ్యాయుల గుర్తించడానికి మార్గదర్శకాలు

  • పాఠశాలలో ఏదైనా పోస్టు ఖాళీగా ఉన్నట్లయితే, పునర్విభజన(Reapportionment) కోసం ఖాళీగా ఉన్న పోస్టును మిగులుగా గుర్తించాలి.  ఈ సందర్భంలో ఏ ఉపాధ్యాయుడూ ప్రభావితం కాడు.
  • పాఠశాలలో సంబంధిత కేటగిరీ పోస్టు నందు 8 అకడమిక్ సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న  ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే పునర్విభజన (Reapportionment) కోసం వారు పనిచేస్తున్న పోస్టును మిగులుగా గుర్తించి బదిలీకి పరిగణించబడుతుంది.
  • పాఠశాలలో 8 అకడమిక్ సంవత్సరాల సర్వీసు పూర్తి చేయని ఉపాధ్యాయుడు పాఠశాలలో  సీనియర్ ఉపాధ్యాయుడిగా ఉండి, పునర్విభజన కిందకు వెళ్లడానికి ఇష్టపడితే, అటువంటి ఉపాధ్యాయుడికి బదిలీకి అవకాశం ఇవ్వబడుతుంది.
  • పైన తెలిపిన 1,2,3 సందర్బాలేవి లేనప్పుడు సంబంధిత కేడర్ లో జూనియర్ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. పోస్టుల పునర్విభజన పాఠశాల మ్యాపింగ్ వలన ప్రభావితం అయినప్పుడు మాత్రమే వారికి పునర్విభజన పాయింట్లు 5 కెటాయించబడుతాయి.  ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు 2020 లో బదిలీపై  పాఠశాలకు వచ్చి ఉంటే వారికి పాత స్టేషన్ పాయింట్లు   కెటాయించబడుతాయి.

గమనిక:

  • పునర్విభజనలో భాగంగా పాఠశాలలో ఎవరైనా దృష్టిలోపము లేదా అంగవైకల్యము 80 శాతం కంటే ఎక్కువ కలిగిన వారు ఉన్నట్లయితే వారికి మినహాయింపు ఉంటుంది వారి స్థానంలో ఆ పాఠశాలలో తరువాత సీనియర్ ఉపాధ్యాయుడు ప్రభావితం కాపాడతాడు.
  • దృష్టిలోపమున్న ఉపాధ్యాయులు ఈ బదిలీ నుంచి మినహాయించబడ్డారు 80% పైబడి అంగవైకల్యమున్న ఉపాధ్యాయులు కూడా బదిలీల నుంచి మినహాయించబడ్డారు. అటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా బదిలీని కోరుకుంటే వారు దరఖాస్తు చేసుకోవచ్చును.

బదిలీ దరఖాస్తు నమోదు లో ఏవైనా సమస్యలుంటే (ప్రస్తుతం పాఠశాలలో చేరిన తేది లాంటివి..) జిల్లా విద్యాశాఖ అధికారికి రిక్వెస్ట్ లెటర్ వ్రాసి సంబంధిత ప్రధానోపాధ్యాయులు/మండల విద్యాశాఖ అధికారులతో ధృవీకరణ సంతకంతో  DEO గారి ట్రాన్స్పర్ సెల్ ను సంప్రదించండి.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *