10th(SSC), Inter APOSS Admissions 2024-25, AP Open Schools, Details

AP Open School SSC, Inter APOSS Admission Notification 2024-25

APOSS SSC(10th), Inter: AP Open School Society(APOSS) issued notification for admission into SSC(10th Class), Senior Secondary Education(Intermediate) course through Open and Distance Learning(ODL) mode. Candidates who could not complete their education in regular schools and Inter college can get admission into Open School SSC, Intermediate Education. Candidate must complete 14 years of age by 31st August 2024. Candidates who are seeking admission for 10th, Inter can apply online from 31st July 2024 to 27th August 2024.  The complete admission process, age criteria, medium of instructions, registration fee, User guide, selection of subjects, duration of course are provided here. Go through the article before apply online at https://apopenschool.ap.gov.in.

APOSS 10th(SSC), Intermediate Admissions Notification 2024-25
APOSS 10th(SSC), Intermediate Admissions Notification 2024-25

Overview of APOSS 10th, Inter Admissions

Name of the Article AP Open School 10th/Inter Admissions
Name of the Board AP Open School Society(APOSS)
Admission  10th Class,  Intermediate in Open Distance Mode
Academic Year 2024-25
Mode of Application Online APPLICATION
Commencement of Application 31st July 2024
Last Date to apply 27th August 2024
Official Website https://apopenschool.ap.gov.in

Apply Online for Admission, Schedule

Name of the Event
Schedule
Commencement of Admissions 31/07/2024
Last date for submission of ONLINE application, fee payment with prescribed fee 27/08/2024

All District Educational Officers(DEOs) and District Coordinators in the State are requested to issue Press/Media Note in their respective Districts for wide publicity among the learners and public so as to reach every nook and corner of the concerned District with regard to admissions into S.S.C(10th class) & Intermediate courses of APOSS for the academic year 2024-25.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) ద్వారా 2024-2025 విద్యా సంవత్సరంనకు సంభందించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ తరగతులలో అడ్మిషన్ పొందడానికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) సంచాలకులు వారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది. పదవ తరగతిలో చేరుటకుగాను 14 సంవత్సరాలు నిండిన వారికి మరియు ఇంటర్మీడియట్ చేరుటకుగాను పదవ తరగతి పాసై 15 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తులు చేయుటకు అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి www.apopenschool.ap.gov.in నందు 31-07-2024 నుండి అవకాశం.

AP Open School SSC(10th Class) Inter Admissions 2024-25

ప్రవేశం కొరకు వివరములు:

  • అడ్మిషన్లు ప్రారంభ తేది: 31-07-2024
  • అడ్మిషన్లు ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి చివరి తేది: 27-08-2024
  • అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేది: 28-08-2024
  • Rs. 200/- లేటు ఫీజుతో అడ్మిషన్లు ఆన్లైన్ లో చేయడానికి చివరి తేది: 04-09-2024

ప్రవేశమునకు సూచనలు:

  • దరఖాస్తు వివరముల నమూనా నింపబోయే ముందు ప్రాస్పెక్టస్ నందలి సూచనలన్ని జాగ్రత్తగా చదివి, విద్యార్హతలు, కనీస వయస్సు మొదలైన అర్హతల గురించి సంతృప్తి చెందవలెను. తదుపరి ఆన్లైన్ దరఖాస్తులో పూర్తిచేయవలసిన అంశముల అవగాహన కోసం నమూనా దరఖాస్తు నింపవలెను.
  • అభ్యాసకులు దరఖాస్తు చేసుకొనుటకు మరియు 30 రోజుల పి.సి.పి. (ముఖాముఖి) తరగతులకు హాజరయ్యేందుకు తమకు అనుకూలమైన అధ్యయన కేంద్రము (A.I.) ను ఎంపిక చేసుకోవచ్చును.
  • ఒక అధ్యయన కేంద్రము నందు కనిష్ఠంగా నమోదు కావలసిన ఇంటర్మీడియట్ అభ్యాసకుల సంఖ్య సైన్సు గ్రూపు నందు 30 మరియు నాన్ సైన్సు గ్రూపు నందు 30, అంతకన్నా తక్కువగా A.I లో నమోదైనచో, సంబంధిత A.I. లోని అభ్యాసకులను అందుబాటులో ఉన్న మరియొక A.I. లోనికి సర్దుబాటు చేయబడును. అట్టి అభ్యాసకులు ముఖాముఖి తరగతులకు (P.C.Ps) సర్దుబాటు చేయబడిన అధ్యయన కేంద్రములకు మాత్రమే హాజరవ్వవలెను. దీనికి సంబంధించి ఎ.పి. ఓపెన్ స్కూల్ ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు అనుమతించదు.
  • దరఖాస్తు సమర్పించడం నుండి ఫీచెల్లించి, ప్రవేశం నిర్ధారించు వరకు అన్ని దశలు ఆన్లైన్లో మాత్రమే అనుమతించబడును. ఆన్లైన్ కాకుండా మరి ఏ ఇతర విధానము ఎట్టి పరిస్థితులలోను అనుమతించబడదు.

APOSS 10th Admissions Eligibility, Age Limit

ఓపెన్ స్కూల్ వారి పదవ తరగతి పాస్ సర్టిఫికెట్ పాఠశాలల 10వ తరగతికి సమానం. ఈ సర్టిఫికెట్కు ప్రభుత్వ గుర్తింపు ఉంది. ఈ సర్టిఫికెట్ ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాలకు అర్హత కల్పిస్తుంది.

ప్రవేశ అర్హతలు Eligibility: చదువుకు దూరమైన వారికి, బడి మధ్యలో మానేసిన వారికి SSC లో ఫెయిల్ అయిన వారికి, మరియు 14 సంవత్సరములు నిండి చదవగలిగిన మరియు వ్రాయగలిగిన పరిజ్ఞానం కలిగి ఎటువంటి విద్యార్హతలు లేనప్పటికి ఆగష్టు 31, 2024 నాటికి 14 సంవత్సరములు నిండిన వారందరూ అర్హులే. గరిష్ఠ వయో పరిమితి లేదు.

బోధనా విషయాల (Subjects) ఎంపిక: ఓపెన్ స్కూల్ నందు బోధనా విషయాలు రెండు గ్రూపులుగా విభజింపబడ్డాయి. అభ్యాసకులే స్వయంగా వారికి నచ్చిన బోధనా విషయాలను క్రింది గ్రూపుల నుండి ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది.

  • గ్రూప్ ‘ఎ’ భాషలు.
  • గ్రూప్ ‘జ’ మెయిన్ సబ్జెక్టులు (భాషేతర విషయాలు)

బోధనా మాధ్యమం (Medium of Instruction) ఎంపిక: తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మరియు ఒరియా మాధ్యమాలను ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది.

కోర్సు కాల వ్యవధి: ఒక్క సంవత్సరము.

ప్రవేశ చెల్లుబాటు కాల వ్యవధి : ఐదు సంవత్సరములు. ప్రవేశం పొందిన తరువాత 5 సంవత్సరాలలో 9 పర్యాయాలు పరీక్ష వ్రాసే అవకాశం..

క్రెడిట్ అక్యుములేషన్ మరియు పరీక్షా విధానం : అభ్యాసకులు ఒకేసారి అన్ని సబ్జెక్టులలో పరీక్షకు హాజరు కావాలనే నియమం లేదు. ఒకటి కాని అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులలో కాని వారి సౌలభ్యాన్ని బట్టి హాజరు కావచ్చును.

నిర్ణీత 5 సంవత్సరాలలో ఎప్పుడు వారు కోర్సులో ఎంపిక చేసుకున్న అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారో అప్పుడు పాస్ సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి.

సంవత్సరంలో రెండు పర్యాయములు అనగా మార్చి/ఏప్రియల్ మరియు జూన్ /జులైలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడతాయి.

మార్కుల బదలాయింపు (TOC) : దేశంలోని గుర్తింపబడిన బోర్డులలో 10వ తరగతి ఫెయిల్ అయినప్పటికీ, అట్టి వారు పాసైన రెండు సబ్జెక్టుల వరకు మార్కులు బదలాయించుకునే అవకాశం. అట్టి సబ్జెక్టులు అడ్మిషన్ పొందిన గత 5 సం॥లలోపు పాసై ఉండాలి.

ప్రవేశ రుసుము :

  • రిజిస్ట్రేషన్ ఫీజు : రూ. 100/- (అందరికీ)
  • అడ్మిషన్ ఫీజు: జనరల్ కేటగిరి పురుషులకు రూ. 1300/-
  • ఇతరులు : అనగా మహిళలు, SC, ST, BC, మైనారిటీలు, దివ్యాంగులు (CwSA), ట్రాన్స్ జెండర్లు మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకు రూ.900/-

గమనిక : అడ్మిషన్ ఫీజు రాయితీ పొందేవారు సంబంధిత ధృవీకరణ పత్రములు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయవలెను.

పరీక్షా రుసుము: ప్రతి సబ్జెక్టుకు రూ.100/-
గమనిక: దివ్యాంగ (CwSN) విద్యార్థులకు పరీక్ష ఫీజులో రాయితీ కలదు.

APOSS Inter Admissions Eligibility, Fee Details

ఇంటర్మీడియట్ (INTERMEDIATE) ఓపెన్ స్కూల్ ద్వారా SSC లో ఉత్తీర్ణులైన వారితో పాటు పాఠశాలల్లో SSC పూర్తి చేసి వివిధ కారణాల వలన ఇంటర్మీడియట్ చదవలేక పోయిన వారికి, కళాశాల చదువు మానివేసిన వారికి మరియు ఇంటర్ ఫెయిల్ అయిన వారికొరకు సార్వత్రిక విద్యావిధానంలో ఇంటర్మీడియట్ కోర్సు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కోర్సును  ప్రారంభించింది.  ఓపెన్ స్కూల్ వారి ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ కళాశాలల ఇంటర్మీడియట్కు సమానం. ఈ సర్టిఫికెట్కు ప్రభుత్వ గుర్తింపు ఉంది. ఈ సర్టిఫికెట్ ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాలకు అర్హత కల్పిస్తుంది.

ప్రవేశ అర్హతలు Eligibility: 10వ తరగతి పూర్తి చేసి, ఆగష్టు 31, 2024 నాటికి 15 సంవత్సరములు నిండిన వారందరికి ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం. ఇంటర్మీడియట్ కోర్సుకు గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుండి లేదా APOSS ద్వారా పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి లేదు.

బోధనా విషయాల (Subjects) ఎంపిక: ఓపెన్ స్కూల్ నందు బోధనా విషయాలు రెండు గ్రూపులుగా విభజింపబడ్డాయి. అభ్యాసకులే స్వయంగా బోధనా విషయాలను క్రింది గ్రూపుల నుండి ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది.

  • గ్రూప్ ‘ఎ’ – భాషలు
  • గ్రూప్ ‘బి’ – మెయిన్ సబ్జెక్టులు (భాషేతర విషయాలు)

మాధ్యమం (Medium of Instruction) ఎంపిక:
తెలుగు, ఇంగ్లీషు మరియు ఉర్దూ మాధ్యమాలను ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది. కోర్సు కాల వ్యవధి : ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత కొరకు SSC ఉత్తీర్ణత సాధించిన నాటి నుండి రెండు సంవత్సరములు అంతరం ఉండాలి.

ప్రవేశ చెల్లుబాటు కాల వ్యవధి: ఐదు సంవత్సరములు. ప్రవేశం పొందిన తరువాత 5 సంవత్సరాలలో 9 పర్యాయాలు పరీక్ష వ్రాసే అవకాశం.

క్రెడిట్ అక్యుములేషన్ మరియు పరీక్షా విధానం : అభ్యాసకులు ఒకేసారి అన్ని సబ్జెక్టులలో పరీక్షకు హాజరు కావాలనే నియమం లేదు. ఒకటి కాని అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులలో కాని వారి సౌలభ్యాన్ని బట్టి హాజరు కావచ్చును.

నిర్ణీత 5 సంవత్సరాలలో ఎప్పుడు వారు కోర్సులో ఎంపిక చేసుకొన్న అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారో అప్పుడు పాస్ సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి. సంవత్సరంలో రెండు పర్యాయములు అనగా మార్చి / ఏప్రియల్ మరియు జూన్ / జులైలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడతాయి.

మార్కుల బదలాయింపు (TOC) : దేశంలోని గుర్తింపబడిన బోర్డులలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పటికీ, అట్టి వారు పాసైన రెండు సబ్జెక్టుల వరకు మార్కులు బదలాయించుకునే అవకాశం. అట్టి సబ్జెక్టులు అడ్మిషన్ పొందిన గత 5 సంవత్సరాలలోపు పాసై ఉండాలి.

ప్రవేశ రుసుము :

  • రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.200/- (అందరికీ)
  • అడ్మిషన్ ఫీజు : జనరల్ కేటగిరి పురుషులకు రూ. 1400/-
  • ఇతరులు : అనగా మహిళలు, SC, ST, BC, మైనారిటీలు, దివ్యాంగులు (CwSN), ట్రాన్స్ జెండర్లు మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకు రూ.1100/-

గమనిక: అడ్మిషన్ ఫీజు రాయితీ పొందేవారు సంబంధిత ధృవీకరణ పత్రములు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయవలెను.

పరీక్షారుసుము :
ప్రతి సబ్జెక్టుకు రూ.150/- మరియు ప్రాక్టికల్స్ కలిగిన ప్రతి సబ్జెక్టుకు అదనంగా రూ. 100/- గమనిక: దివ్యాంగ (OwSN) విద్యార్థులకు పరీక్ష ఫీజులో రాయితీ కలదు.

APOSS AP Open School Online Admission Procedue, Registraion

రిజిస్ట్రేషన్ పద్ధతి:

  • వ్యక్తిగతంగానైనా లేక ఎ.పి.టి. ఆన్ లైన్ కేంద్రము మరియు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారానైనా అభ్యాసకులు అన్ని దశల ప్రవేశ దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసుకొనవచ్చును.
  • ఏదైనా కోర్స్ రిజిస్ట్రేషన్ కొరకు https://apopenschool. ap.gov.in వెబ్ సైట్ లోనికి ప్రవేశించి, అడ్మిషన్ పేజీ నందలి రిజిస్ట్రేషన్ బటన్ను క్లిక్ చేసి, INTERMEDIATE కోర్సును సెలెక్ట్ చేసుకొనవలెను. తదుపరి అభ్యాసకులు తమ మొబైల్ నెంబర్, పూర్తి పేరు, లింగం, పుట్టిన తేదీ మరియు తండ్రి పేరుని నమోదు చేసి ‘సబ్మిట్’ చేయవలెను. సబ్మిషన్ ను విజయవంతముగా పూర్తిచేసిన తర్వాత వెబ్సైట్నందు గల Payment Gateway/APT ONLINE ద్వారా నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించవలెను, తదుపరి దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయుటకు మరియు అడ్మిషన్ ఫీజు చెల్లింపు పూర్తిచేయుటకు అభ్యాసకులకు సంక్షిప్త సమాచారము (SMS) ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ పంపబడును. పాస్ సర్టిఫికెట్లు డిజిలాకర్కు అనుసంధానమైనందున అభ్యాసకుని ఖచ్చితమైన ఆధార్ నెంబర్ను నమోదు చేయవలెను.
  • అభ్యాసకులు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఒకసారి రిజిస్ట్రేషన్కు మాత్రమే అంగీకరింపబడును.
  • రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినంతమాత్రాన ప్రవేశము, సీటు కేటాయించుట నిర్ధారణ అయినట్లు కాదు. ప్రవేశ నిబంధనలన్ని ఖచ్చితంగా పాటించినప్పుడు మాత్రమే ప్రవేశ నిర్ధారణ జరుగును.

Important Links for APOSS 10th(SSC), Intermediate Admissions

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *