APGLI INFORMATION | APGLI SLIPS 2024 రివైజ్డ్ పేస్కేల్ – 2010 అనుసరించి పెంచిన ఎపిజిల్ఐ స్లాబ్ రేట్స్
ప్రభుత్యం ,జి.ఓ .121, ఫైనాన్సు(అడ్మిన్-II) తేది 28-06-2010 ద్వారా ఎపిజిల్ఐ ప్రీమియం స్లాబ్ రేట్లు క్రింద తెలిపిన విధముగా తేది 1-7-2010 నుండి పెంచబడినది. ఈ స్లాబు రేట్లు ప్రకారమే కాక బేసిక్ పే పైన 20%, వరకు ప్రీమియం చెల్లించవచ్చు. మున్సిపల్ ఉద్యోగులకు ఎపిజిల్ఐ స్కీంను వర్తింపచేయు ,జి.ఓ యం.స్ .నెం:25, తేది 3-3-2011 న ఉత్తర్వులు జారిచేయడమైనది.
2010 పే స్కేల్స్ (2010 Pay Scales)
రు.6700 నుండి 8400 వరకు
రు.8441 నుండి 10900 వరకు
రు.10901 నుండి 14860 వరకు
రు.14861 నుండి 18030 వరకు
రు.18031 నుండి 25600 వరకు
రు.25601 నుండి ఆపైన
నెలవారి ప్రీమియం (Monthly Premium)
రు.250-00
రు.350-00
రు.450-00
రు.600-00
రు.750-00
రు.1000-00
TOP RATED
సంవత్సరములు 21 పైన ,53 సంవత్సరములోపు వయసుగల రాష్ట్ర ప్రభుత్య మరియు పంచాయతీరాజ్ ఉద్యోగుల, ౧౦ సమత్సరముల సర్వీసు పూర్తి చేసిన వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు,తప్పని సరిగా తమ జీతాలనుండి జి.ఓ మేరకు కొత్తగా గాని, అదనముగా గాని ప్రతిపాదనల పారములను సమర్పించి (53సంవత్సరములు లోపు వారు మాత్రమే) పాలసీలు పొందాలి.ప్రతిపాదన పత్రం లోని అన్ని ప్రశ్నలకు సరిఅయిన జవాబులు వ్రాయవలెను. గుర్తులు లేదా గీతాలు అంగీకరించబడవు.ప్రస్తుతం పాలసీలు చేల్లిస్తున్నవారు 48 సంవత్సరములు దాటిన మరో పాలసి తీసుకొనవచ్చును.(మేమో.నెం.29335/345/ఎ2/అడ్మిషన్ II/10 తేది: 5-3-2010.
ఉద్యోగుల జీతల నుండి ప్రీమియంను మినహాయించి ,ప్రతిపాదనలు స్వీకరించి వాటిని జిల్లా భీమ కార్యాలయాలకు పంపవలసిన భాద్యత DDO ల మీద కలదు.
ఎపిజిల్ఐ శాఖ తన పాలసీదారులకు ఆసియాలోనే అత్యధిక బోనస్ అనగా ప్రతి రూ.1000/- లభీమ మొత్తానికి ప్రస్తుతము అమలులో ఉన్న రేటు ప్రకారము రూ.100/- మరియు రూ.5/- లు టెర్మినల్ బోనస్ తో కలిపిచెల్లిస్తుంది.
రిటైర్మెంట్ నకు మూడు నెలలు ముందుగా ప్రతిపాదనలు ఫైనల్ పేమెంట్ నకు పంపవచ్చును.
APGLI Latest
APGLI Downloads
|